హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని, రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలును విజయవంతం చేశారంటూ అధికారులు, కలెక్టర్లను అభినందించారు. మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కలెక్టర్లతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లు, పంటల సాగు, ఇందిరమ్మ ఇం డ్లు, భూభారతి తదితర అంశాలపై చర్చించారు. సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు 64.5 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, రైతులకు రూ.12,184 కోట్లు చెల్లించామని చెప్పారు.