Aadhar Card |హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని, కేంద్రాలకు రైతులు అధార్ తేవాలని మార్కెటింగ్ శాఖ తెలిపింది. ‘నమస్తే తెలంగాణ’లో ‘పత్తి కొనుగోళ్లు ఏమాయే’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనంపై మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. 148 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశామని తెలిపారు.
రైతుల బ్యాంకు ఖాతా నంబర్‌కు ఆధార్‌తో లింకు ఉండాలని, ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. 321 జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొన్నాయని తెలిపారు. వాట్సాప్ ద్వారా కొనుగోలు కేంద్రాల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. వరంగల్, ఖమ్మం మార్కెట్లలో 30-35శాతం తేమగల పత్తి రూ. 5000 నుంచి రూ. 6950 ధర పలుకుతున్నదని తెలిపారు. మద్దతు ధర రూ. 7521 కన్నా తక్కువ ధర పలుకుతున్నదని స్పష్టం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో 8-12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని తెలిపారు.