హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అక్రెడిటేషన్ కార్డులు, న్యాయమైన హక్కుల కో సం ఉద్యమిస్తున్న జర్నలిస్టులను అ క్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టు చేసి న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 252ను రద్దు చేయాలని శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆం దోళన చేపట్టిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై హరీశ్ మాట్లాడుతూ సర్కారు వైఖరిని ఖండించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ని లదీస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో ఏ డో గ్యారెంటీ ప్రజాస్వామ్యం అన్నా రు.
కానీ ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు. ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ధర్నా చేసే హక్కులేదా? దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా? ఇదేనా మీరు ఇస్తామన్న ఏడో గ్యారెంటీ?’ అం టూ నిప్పులు చెరిగారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు అనే తేడా లేకుం డా కేసీఆర్ ప్రభుత్వం 26 వేల అక్రెడిటేషన్ కార్డులిచ్చిందని గుర్తుచేశా రు. అధికారంలోకి వస్తే ఇండ్లు కట్టిస్తామని, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని నమ్మబలికిన రేవంత్‌రెడ్డి, గద్దెనెక్కిన వెంటనే హామీలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులతో పోల్చడం దారుణమని మండిపడ్డారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉం టుందని స్పష్టంచేశారు.