కొవిడ్‌పై ఆందోళన వద్దు.. ప్రపంచదేశాల్లో కరోనావ్యాప్తిని గమనిస్తున్నాం: హరీశ్‌రావు
కరోనా పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
- వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నది
- కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రతి ఒకరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కొవిడ్ టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కొవిడ్ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి, కొవిడ్ సన్నద్ధతపై మంత్రి హరీశ్‌రావు గురువారం ఆన్లైన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు.
అనంతరం ఆరోగ్య శాఖ కొవిడ్ సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నదని, ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరోనాను విజయవంతంగా ఎదురొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని అన్నారు.
కరోనా, కొత్త వేరియంట్ వ్యాప్తి మన దగ్గర లేనప్పటికీ.. ముందుజాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకోవాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం గాంధీ దవాఖానకు పంపాలన్నారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

