ఇల్లంతకుంట : సమైక్య పాలకుల చిన్నచూపుతో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జీవం పోసుకొన్నాయి. కాలంతో పనిలేకుండా జలకళతో అలరారుతున్నాయి. మండుటెండల్లోనూ మత్తడి దుంకుతూ కనువిందు చేస్తున్నాయి. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం చెరువు నిదర్శనం. నిండుగా జలాలతో మత్తడి దుంకుతుండగా.. ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చూసి సంబురపడ్డారు. చెరువు వద్దకు వెళ్లి గంగమ్మకు కొబ్బరికాయ కొట్టి మత్స్యకారులతో సరదాగా చేపలు పట్టారు.