హైదరాబాద్‌లోనే 15 వేల ట్యాంకర్లతో నీటి సరఫరా
హైదరాబాద్ నగరంలో రోజుకు 15 వేల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా అంగీకరించారు.
- నీటి ఎద్దడిని అంగీకరించిన మంత్రి పొంగులేటి
- నడి వేసవిలో ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్’ విడుదల
హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో రోజుకు 15 వేల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా అంగీకరించారు. ఈ విషయం రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర మంచినీటి ఎద్దడికి సాక్ష్యంగా నిలుస్తున్నది. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు 14 గంటలు ఫిల్లింగ్ చేస్తూ 15 వేల వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తుంటే, రానున్న రోజుల్లో మరింత నీటి ఎద్దడి తలెత్తనున్నట్టు స్పష్టమవుతున్నది. తాజా నీటి పరిస్థితిపై శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఇందుకు సంబంధిత శాఖలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉన్న నేపథ్యంలో ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్’ అమలుచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణశాఖ, ఇండియన్ మెట్రలాజికల్ శాఖలు సంయుక్తంగా రూపొందించిన ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

