హైదరాబాద్ : ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు(Narayanapur reservoir) నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్(Sunke Ravi shankar) పోరాటం ఫలించింది. రవి శంకర్ క్షేత్రస్థాయి పర్యటనతో ఎట్టకేలకు మేలుకున్న అధికారులు పంటలకు నీటిని విడుదల చేశారు. కాగా, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం నారాయణపూర్ గ్రామంలో నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. కరెంట్ ఉండదు, నీళ్లు రావు, కాంగ్రెస్ వాళ్లను నమ్మి మోసపోయామంటూ రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
తులం బంగారం వద్దు, పెన్షన్లు వద్దు నీళ్లు ఇస్తే చాలంటూ ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. రైతుల కష్టాలను గమనించిన రవి శంకర్ ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులకు ఈ నెల 21లోగా నీళ్లు అందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు అధికారులు నీళ్లు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల కోసం రైతుల తరఫున బీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటి విడుదల
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పర్యటనతో ఎట్టకేలకు మేలుకున్న అధికారులు https://t.co/bOFf50yI4G pic.twitter.com/Xa4fSCSp8V
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025