అయిజ, మార్చి 5 : ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి లభ్యత తగ్గుతుండటంతో బుధవారం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఆర్డీఎస్, కేసీ కెనాల్ నీటి వాటా నుంచి 4 వేల క్యూసెక్కులు వదిలారు. 2024-25 ఏడాదికిగానూ కేటాయించిన నీటి వాటా నుంచి చివరి ఇండెంట్‌ను విడుదల చేశారు. 9 రోజులపాటు 2.6 టీఎంసీలు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఉత్తర్వుల మేరకు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్కు ఇండెంట్ పెట్టారు. రోజుకు 4వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 13 వరకు విడుదల కొనసాగుతుందని ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 9వ తేదీ వరకు ఆర్డీఎస్ నీళ్లు చేరుతాయని పేర్కొన్నారు