హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కవితపై మాట్లాడిన మాటలు ఆయన అక్కనో, చెల్లనో అంటే ఊరుకుంటడా అంటూ ప్రశ్నించారు.
‘కవితను పట్టుకొని అంత మాట అంటవా, గబ్బోడా, పనికిరానోడా, నీకు అక్కలు, చెల్లెలు లేరురా?’ అంటూ నల్గొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన మహిళలు బండిపై మండిపడ్డారు. ‘గడ్డి తింటున్నావా, పనికిరానోడా, ఇంకోసారి మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదు’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే చెప్పుతో కొడతాం, బట్టలిప్పి కొడతాం’ అంటూ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో మహిళలు తిడుతున్న వీడియో వైరల్ అయ్యింది.