అందోల్, మార్చి 16: సంగారెడ్డి జిల్లాలో సోమవారం వడగండ్లు పడ్డాయి. అందోల్ మండలంలో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వడగండ్ల వాన కురిసింది. మధ్యాహ్నం కొన్నిచోట్ల… సాయంత్రం కొన్నిచోట్ల భారీ వాన పడింది. నేరడిగుంట, కన్సాన్పల్లి తదితర గ్రామాల్లో వడగండ్లు, ఈదురు గాలులతో పాటు వర్షం వచ్చింది. మామిడి పూత నేలరాలింది. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
గుమ్మడిదల, మార్చి 16: వడగండ్ల వాన దంచికొట్టింది. గుమ్మడిదల మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం వడగండ్ల వానకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి చెట్లు నేలకూలాయి.