పర్వతగిరి, డిసెంబర్ 26 : వడ్లు విక్రయించి పక్షం రోజులు దాటిందని, బోనస్ ఇంకెప్పుడిస్తారంటూ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాల్పురం రైతులు నిలదీశారు. నవజీవన్ రైతు సహకార సొసైటీ రోళ్లకల్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ పడలేదని గురువారం 30 మంది రైతులు నిరసన చేపట్టారు.
ధాన్యం డబ్బులు వచ్చినా బోనస్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బోన స్ డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు.