గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 01:39:45

కరోనా పోరులో ‘కాకతీయ’ వైద్యురాలు

కరోనా పోరులో ‘కాకతీయ’ వైద్యురాలు

  • అమెరికాలో సేవలందిస్తున్న వరంగల్‌వాసి ఆరాధన
  • నిత్యం 12 గంటలు విధుల్లోనే.. అభినందనల వెల్లువ

పోచమ్మమైదాన్‌ (వరంగల్‌): నిత్యం వేలసంఖ్యలో కరోనా మరణాలు.. అంతకు పదింతలకుపైగానే పాజిటివ్‌ కేసులు.. అమెరికాలో వైరస్‌తో జనం పిట్టల్లా రాలిపోతున్నా వెనుకడుగు వేయకుండా రోగులకు సేవలందిస్తున్నారు వరంగల్‌ వైద్యురాలు. రిస్క్‌ అని తెలిసినా అవిశ్రాంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆరాధన అగర్వాల్‌. వరంగల్‌కు చెందిన ప్రముఖ ఫిజీషియన్‌ డాక్టర్‌ నరేశ్‌ అగర్వాల్‌ కుమార్తె ఆరాధన అగర్వాల్‌ కాకతీయ వైద్య కళాశాలలో 2002లో ఎంబీబీఎస్‌, 2003లో ఎండీ (డెర్మటాలజీ) పూర్తిచేశారు. 2006లో అమెరికా వెళ్లి మూడేండ్ల ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చదివారు. ఆరాధన భర్త రమిత్‌ అగర్వాల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. న్యూజెర్సీలో నివసిస్తున్న ఆరాధన.. అక్కడకు 30 కి.మీ. దూరంలో ససెక్స్‌ కౌంటీలోని న్యూటన్‌ దవాఖానలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. నిత్యం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పీపీఈ కిట్లు ధరించి దవాఖానలో కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారు. అంకితభావంతో వైద్యం అందిస్తూ కాకతీయుల గడ్డకు పేరు తీసుకొస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన స్థానికులు ఇంటికి వచ్చిమరీ అభినందనలు తెలుపుతున్నారు. ‘శభాష్‌ డాక్టర్‌' అంటూ సెల్యూట్‌ చేస్తున్నారు. అమెరికాలో కరోనా బాధితులకు తమ బిడ్డ వైద్య సేవలందించడం గర్వంగా ఉన్నదని ఆరాధన తల్లిదండ్రులు డాక్టర్‌ నరేశ్‌ అగర్వాల్‌, లక్ష్మి అగర్వాల్‌ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య అనిల్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తుమ్మ ప్రభాకర్‌రెడ్డి సైతం ఆరాధనకు అభినందనలు తెలిపారు.

ప్రశంసలే దీవెనలు 

దేశాన్ని రక్షించే సైనికుల్లాగా కరోనాపై పోరాటం చేస్తున్నాం. బాధితులకు వై ద్యం చేయడంలో రిస్క్‌ఉ న్నా పీపీఈ కిట్లు ధరించి, ఇతర జాగ్రత్తలు తీసుకుం టూ చికిత్స అందిస్తున్నాం.  వ్యాధి నయమై బాధి తులు వెళ్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిచడం వల్ల ప్రశంసలు వస్తున్నాయి. ఇవి గుండెనిండా సంతోషాన్ని, ఇంకా పనిచేయాలనే సంకల్పాన్ని ఇస్తున్నాయి. అభినందనలనే దీవెనలుగా భావిస్తున్నాం.

- డాక్టర్‌ ఆరాధన అగర్వాల్‌logo