PG Student Preethi | పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి (PG Student Preethi)ని లక్ష్యంగా చేసుకుని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని వరంగల్ సీపీ (Warangal Cp) రంగనాథ్ (Ranganath)తెలిపారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు శుక్రవారం వెల్లడించారు. నాలుగు నెలలుగా ప్రీతిని సైఫ్ వేధించినట్లు చెప్పారు.
‘నాలుగు నెలలుగా ప్రీతిని సైఫ్ వేధిస్తున్నాడు. కేస్ షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలా మాట్లాడాడు. దీనిపై ఈ నెల 18న వాట్సాప్ గ్రూపులో ప్రీతిని అవమానించేలా పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ప్రీతి సైఫ్‌ను పర్సనల్‌గా ప్రశ్నించింది. తనను ఉద్దేశించి వ్యక్తిగతంగా చాట్ చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. అతడు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని స్నేహితులతో చేసిన చాటింగ్‌లో ప్రీతి పేర్కొంది. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన చెందింది. మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బందిగా భావించింది. గత ఏడాది డిసెంబర్ 6న రెండుమూడు సార్లు చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ అక్కడుంది. ఈ నెల 20వ తేదీన వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి చెప్పింది. 21వ తేదీన కాలేజీ యాజమాన్యం ప్రీతి, సైఫ్‌ను పిలిచి విచారించింది. అయినా అతని తీరు మారలేదు. మంగళవారం తెల్లవారుజామున ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది’ అని సీపీ వివరించారు.
ఇతర విద్యార్థులతో కలిసి ప్రీతిని వాట్సాప్ గ్రూపుల్లో సైఫ్ టార్గెట్ చేసినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో అవమానకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించడం కూడా ర్యాగింగ్ కిందకు వస్తుందన్నారు. కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదని.. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల విచారణపై ప్రభావం పడుతుందని అన్నారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభింయాని చెప్పారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.
Also Read..
ప్రీతి వైద్యానికి ఖర్చుకు వెనుకాడొద్దు
Bio Asia2023 | లైఫ్‌సైన్స్ రంగంలో ప్రపంచ హబ్‌గా అవతరించిన హైదరాబాద్: మంత్రి కేటీఆర్