Bio Asia2023 | లైఫ్‌సైన్స్ రంగంలో ప్రపంచ హబ్‌గా అవతరించిన హైదరాబాద్: మంత్రి కేటీఆర్
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు.
హైదరాబాద్: ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు. ఇక్కడ 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయన్నారు. హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరుగనున్న బయో ఏషియా-2023 (Bio Asia) సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని వెల్లడించారు. దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నదని చెప్పారు.
హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. లైఫ్‌సైన్స్ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ అవతరించిందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. గత ఏండేండ్లలోనే 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.
నగరంలో 20కిపైగా లైఫ్‌సైన్సెస్, మెడ్‌టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయని తెలిపారు. లైఫ్‌సైన్సెస్ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. 2023కుగాను ‘జీనోమ్ వ్యాలీ’ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

