జగిత్యాల, సెప్టెంబర్ 15: మహిళలను వేధించడమే బీజేపీ ధర్మమా? ఈడీ నోటీసులతో ఎమ్మెల్సీ కవితను బెదిరించాలనుకుంటున్నారా? అని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత నిప్పులు చెరిగారు. మోదీ సర్కారు రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ కుట్రల కోసం వాడుతున్నదని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ.. ఈడీ ముసుగులో జారీ చేసిన నోటీసులు కవిత కాలి దుమ్ముతో సమానమని చెప్పారు.