చిక్కడపల్లి, ఆగస్టు 25 : మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం ఇవ్వాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి వేతనం 3వేలకు పెంచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వంట కార్మికలకు 10వేలు ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న రేవంత్రెడ్డి అమలుచేయకుండా మోసగించారని మండిపడ్డారు. ధర్నాకు మల్కాజిగిరి ఎంపీ ఈటల మద్దతు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు హన్మాండ్లుచారి, ప్రధాన కార్యదర్శి బాబాయి, భా రతి, సంతోష, మంజుల, శేషన్న పాల్గొన్నారు.