హైదరాబాద్ : గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఇచ్చిన G.O 81 ప్రకారం వారసత్వ ఉద్యోగాలు(Legacy jobs) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్(Praja Bhavan) ఎదుట వీఆర్ఏలు నిరసన(VRAs protes) చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. సీసీఎల్ఏ(CCLA) చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. మంత్రులను కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
వెంటనే తమ సమస్య పరిష్కరించాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్యతో చర్చల అనంతరం వీఆర్ఏలు ఆందోళన విరమించారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇవి కూడా చదవండి..
Suryapet | కొడుకు అన్నం పెట్టడం లేదంటూ కంటతడి పెట్టిన కన్నతల్లి.. ఆర్డీవోకు ఫిర్యాదు
Amshula Satyanarayana | ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి