Amshula Satyanarayana | ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి
Amshula Satyanarayana | ఫ్లోరైడ్ రక్కసిపై అలుపెరగని ఉద్యమాలు చేసిన అంశుల సత్యనారాయణ(75) ఇక లేరు. గత నాలుగేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన సొంతూరు శివన్నగూడెంలో తుదిశ్వాస విడిచారు.
Amshula Satyanarayana | నల్లగొండ : ఫ్లోరైడ్ రక్కసిపై అలుపెరగని ఉద్యమాలు చేసిన అంశుల సత్యనారాయణ(75) ఇక లేరు. గత నాలుగేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన సొంతూరు శివన్నగూడెంలో తుదిశ్వాస విడిచారు. అంశుల సత్యనారాయణ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఫ్లోరైడ్ రక్కసిపై ఉద్యమాలు చేస్తూనే.. బతుకుదెరువు కోసం సత్యనారాయణ క్షౌర వృత్తితో జీవనం కొనసాగించారు. సత్యనారాయణకు వెంకటమ్మతో వివాహం కాగా తొలుత కుమార్తె జన్మించింది. పుట్టుకతోనే ఫ్లోరైడ్ బాధితురాలు కావటంతో ఆమె ఏడేళ్ల వయసులో మృతి చెందింది. కుమారుడు స్వామి కూడా పుట్టుకతో ఫ్లోరైడ్ బాధితుడు. స్వామి 2022, జనవరిలో మృతి చెందాడు. మూడో సంతానమైన రాజేశ్వరికి ఫ్లోరైడ్ లక్షణాలు రాకపోవడంతో ఆమెకు వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. శివన్నగూడెం గ్రామంలో 4,970 మంది ఉండగా, 320 మంది ఫ్లోరైడ్ పీడితులు ఉన్నారు. ఫ్లోరైడ్‌తో బాధపడుతూ ఇప్పటి వరకు 30 మంది మృతిచెందారు. కుమారుడు స్వామితో కలిసి 35 ఏళ్లుగా ఫ్లోరైడ్ రక్కసిపై వివిధ రూపాల్లో సత్యనారాయణ ఉద్యమించారు.
ఇవి కూడా చదవండి..
Birthday | బర్త్‌డే పేరుతో నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత హంగామా.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్
Gurukula Schools | 10 నెలలుగా కిరాయి చెల్లించని ప్రభుత్వం.. గురుకుల స్కూళ్లు, వసతి గృహాలకు తాళాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

