నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా మిర్యాలగూడ(Miryalaguda) స్థానిక కాంగ్రెస్ నేత( Congress leader) చిలుకూరి బాలు పుట్టిన రోజు వేడుకలు(Birthday) నడిరోడ్డుపై జరుపుకున్నాడు. అర్ధరాత్రి రాజీవ్ చౌక్‌లో డీజే, సౌండ్ సిస్టం పెట్టి డాన్సులు వేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారు. బాలుకు గజమాలను వెయ్యడానికి జేసీబీని పెట్టి రోడ్డుకు అడ్డంగా నిలపడంతో.. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా, కాంగ్రెస్ నేతల అనైతిక చర్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బర్త్ డే పేరుతో నడిరోడ్డుపై హంగామా చేసిన కాంగ్రెస్ నేత.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్
మిర్యాలగూడ స్థానిక కాంగ్రెస్ నేత చిలుకూరి బాలు పుట్టిన రోజు వేడుకలు నడిరోడ్డుపై జరుపుకున్నాడు.
అర్థరాత్రి రాజీవ్ చౌక్‌లో డీజే, సౌండ్ సిస్టం పెట్టి డాన్సులు వేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారు.… pic.twitter.com/YRMPFhGGyx
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024