హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు (Gurukula Schools) వాటి యజమానులు తాళాలు వేశారు. 9 నెలలుగా ప్రభుత్వం కిరాయి చెల్లించనందుకుగాను నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు భవనాల యజమానులు తాళాలు వేశారు. దీంతో దసరా సెలవుల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయట పడిగాపులు కాస్తున్నారు. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్నగర్, భువనగిరిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలకు భవనాల యజమానులు తాళాలు వేశారు. వెంటనే బకాయిలన్నింటినీ చెల్లించాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవనయాజమాన్య సంఘం డిమాండ్ చేసింది.
బ్రేకింగ్ న్యూస్
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు తాళాలు వేస్తున్న బిల్డింగ్ యజమానూలు.
తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్… https://t.co/c7oRnRw8cK pic.twitter.com/qgZbJIwVRn
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024