హైదరాబాద్ : ఆ తల్లి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది. విద్యాబుద్ధులు నేర్పించి తన కొడుకుని ప్రయోజకుడిని చేసింది. ముదిమి వయసులో అండగా ఉంటాడనుకుంటే చివరికి కన్నతల్లికే అన్నం పెట్టడంలేదు( Paying attention) ఆ ప్రభుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది.
కాగా, తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా, తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కనీసం తన కడుపుకు పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ కోదాడ ఆర్డీవోను(Kodada RDO) కలిసి కన్నీరు మున్నీరుగా విలపించింది. పింఛన్ కూడా తన వద్ద నుంచి వారు లాక్కుంటున్నారని వాపోయింది. స్పందించిన ఆర్డీవో చట్టపరంగా న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
కొడుకు అన్నం పెట్టడం లేదంటూ కంటతడి పెట్టిన కన్నతల్లి
సూర్యాపేట – కోదాడ గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది.
కాగా తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా, తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదాడ RDO… pic.twitter.com/GZNXcd4V8V
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024