బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 13:20:27

కాళోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించిన వినోద్‌ కుమార్‌

కాళోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించిన వినోద్‌ కుమార్‌

వరంగల్‌ అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిధులకు కొదువ లేదు. పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సంవత్సరంలో పనులు చేయాలని, నాణ్యతలో తేడాలొస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.