హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : గృహిణులు జాతి నిర్మాతలు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లోజెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధులు లలితారెడ్డి, సోమ భరత్‌లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిందని కొనియాడారు. మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదని, దేశాన్ని నడిపించే జాతి నిర్మాతలని ఆయన అభివర్ణించారు. దేశంలోని ప్రతి మహిళా చేసే సర్వీసుకు నెలకు రూ.30వేలుగా సుప్రీంకోర్టు నిర్ధారించిందని తెలిపారు. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు తీర్పులు చట్టాలతో సమానమని వివరించారు.
సుప్రీం తీర్పుతో మహిళలకు సమాజంలో మరింత విలువ పెరుగుతుందని తెలిపారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. మహిళల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. ప్రస్తుత సమాజంలో మహిళల పనికి సరైన గుర్తింపు లేదని, సుప్రీంకోర్టు తీర్పుతో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధులు, లలితారెడ్డి, సోమ భరత్ మాట్లాడుతూ.. మహిళలపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని తెలిపారు. డాక్టర్లు, ఇంజినీర్లు, రాజకీయ నాయకుల విజయాలు మహిళల కృషి ఉన్నదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.
జైపూర్, జూన్ 12: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లి గ్రామంలో మట్టిదందా జోరుగా సాగుతున్నది. మైనింగ్‌శాఖ మంత్రి వివేక్ ఇలాకాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పేరిట అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి శెట్పల్లి గ్రామ శివారు నుంచి మట్టి తరలిస్తున్న లారీలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మట్టి లారీలను పోలీస్‌స్టేషన్ తరలించారు.
శుక్రవారం కూడా ఎల్కంటి ఎర్రచెరు వు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న లారీలను గంగిపెల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అనుమతులు చూపించాలని కోరగా.. ఏప్రిల్‌లోనే ముగిసిన అనుమతి పత్రాలను చూపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అధికారులకు ఈ దందా గురించి తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల అవసరాలకు చెరువు మట్టిని ఐ దు కిలోమీటర్లలోపు మాత్రమే తరలించాలన్నా నిబంధన ఉన్నా.. అక్రమార్కులు పెద్దఎత్తున లారీల్లో తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.