శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 02:42:05

వరంగల్‌-కరీంనగర్‌ హైవే అధ్వాన్నం

వరంగల్‌-కరీంనగర్‌ హైవే అధ్వాన్నం

  • కేంద్రం తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ డిమాండ్‌

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే జాతీ య రహదారి అధ్వానంగా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కనీసం మరమ్మతుకు కూడా నోచుకోవడం లేదని, ఈ విషయంలో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ రోడ్డును పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. వరంగల్‌ నుంచి కరీంనగర్‌ ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని జాతీయ రహదారులకు కనీసం మరమ్మతులు చేపట్టకుం డా కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తక్షణమే వరంగల్‌-కరీంనగర్‌ హైవేకు మరమ్మతులు చేపట్టాలని వినోద్‌కుమార్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. logo