Drinking Water | జనగామ రూరల్ : జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్లో రెండు రోజులుగా తాగునీరు సరఫరా చేసే బోరుమోటర్లు పనిచేయకున్నా పట్టించుకునే వారేలేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామకార్యదర్శికి విషయం తెలిపినా పట్టించుకోకపోవడంతో వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని తెలిపారు.
పొతంగల్, మే 1: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ గ్రామస్థులు ఎంపీడీవో ఆఫీస్ ఎదుట గురువారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఎస్సీ, వడ్డెర, బాజిరెడ్డి కాలనీల్లో కొన్ని నెలలుగా నల్లా నీళ్లు రావడంలేదని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.