ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. వివరాల్లోకి వెళ్తే.. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ శాఖ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహిం చారు. కార్డెన్ సెర్చ్‌లో(Cordon Search) పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులపై(Forest department officials) గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో జాదవ్ నౌశిలాల్ అనే బీట్ ఆఫీసర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే అటవీ శాఖకు సంబంధిం చిన ఓ వాహనం పై దాడి చేసి అద్దాలు పగలకొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా, దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఆదిలాబాద్ జిల్లాలో అటవీ అధికారుల మీద దాడి చేసిన గ్రామస్థులు
ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత
తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన అటవీ అధికారులు
కార్డెన్ సెర్చ్ లో పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్
కలప దుంగలు… pic.twitter.com/Lsz9kpHvqd
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025