గీసుగొండ, డిసెంబర్ 9 : ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఓ గ్రామస్తుడు నిలదీశాడు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవపల్లిలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయన మాట్లాడుతుండగా ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని స్థానికుడు చుంకు కుమారస్వామి ప్రశ్నించారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండానే ప్రచారం చేసుకుంటూ వెళ్లారు.