Harish Rao | కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని పల్లె ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో వివ్వసనీయత కోల్పోయాని తెలిపారు. సిద్దిపేట జిల్లా నాంచారుపల్లి బీజేపీ సర్పంచ్ నరసింహారెడ్డి ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దకోడూరుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కపట నాటకాలకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని అన్నారు. బీజేపీది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు.. అది సబ్కా బక్వాస్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. పేదల పథకాలకు ఎసరుపెట్టే కటింగ్ మాస్టర్ అని విమర్శించారు. మహిళలకు రూ.55 వేలు, వృద్ధులకు రూ.44 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు.