Telangana Decade Celebrations | ఊరంతా గుంతల రోడ్డు, ఆ రోడ్డు నిండా మురికి గుంటలు.. ఇంటిపక్కన చెత్తాచెదారం, వాడ నిండా పెంటకుప్పలు.. ఇంటికి నీళ్లు రావు, వచ్చినా గబ్బు వాసన. నాడు మన పల్లెల పరిస్థితి ఇది.
మరిప్పుడో.. పల్లె ప్రగతితో గ్రామానికో పల్లె ప్రకృతి వనం వచ్చింది. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు వచ్చినయ్. తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా మారినయ్. ఊరికో ట్రాక్టర్ వచ్చింది. ఊరూరా వైకుంఠ ధామాలు వెలిసినయ్. అవార్డులతో తెలంగాణ గ్రామాలు సింగారించుకుంటున్నయ్.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ, వైకుంఠధామం, డంపింగ్ షెడ్, నర్సరీ, మొక్కల పెంపకం, గ్రామానికో కార్యదర్శి.. ఇలా ప్రతి గ్రామానికి శాచురేషన్ విధానంలో పనులు చేపట్టారు. వాటి ఫలితమే జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డుల పంట పండుతున్నది.
ట్రాక్టర్ దిద్దిన గ్రామాలు
గ్రామ పారిశుద్ధ్య వ్యవస్థను మార్చేందుకు రాష్ట్రంలోని 12,769 పంచాయతీల్లో రూ.1,276 కోట్లతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు. గుంతలను పూడ్చటం, కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లు, పాడుబడ్డ బావులు, బొందలను పూడ్చటం, వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేయడం వంటి చర్యలతో గ్రామాలు మెరుగయ్యాయి.
సామాజిక విప్లవం.. వైకుంఠధామం
12,769 పంచాయతీల్లో రూ.1,532 కోట్లతో హైదరాబాద్ మహాప్రస్థానం తరహా వైకుంఠ ధామాలను నిర్మిస్తున్నది. వీటిలో నీరు, కరెంటు, రోడ్డు, గదులు, పార్కింగ్, బర్నింగ్ ప్లాట్‌ఫాంలు, అస్థికలు నిల్వ చేసుకొనే బాక్స్‌లను ఏర్పాటు చేసింది.
ఓడీఎఫ్ ప్లస్ రాష్ట్రంగా..
కేంద్రం 2019 లో ఓడీఎఫ్‌గా, 2022లో ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.
నేరుగా నిధులు
స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022-23లో ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.256 కోట్లు స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ఇందులో 85 శాతం గ్రామాలకు, 10 శాతం మండల పరిషత్తులకు, 5 శాతం జిల్లా పరిషత్తుకు కేటాయించింది.
టాప్‌లో అన్నీ మనవే
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) పథకం అమలులో దేశంలో టాప్ 20 ర్యాంకుల్లో 19 మన రాష్ట్ర గ్రామాలే నిలిచాయి. 2019-20లోనే దేశంలో 100కు వంద శాతం గ్రామాలకు ఆన్లైన్ ఆడిట్ నిర్వహించింది. దీంతో కేంద్రం మన రాష్ట్ర ఆడిట్ అధికారులతో ఇతర రాష్ర్టాలకు శిక్షణ, సూచనలు, సలహాలు ఇప్పించింది.
డంపింగ్ షెడ్స్
ప్రతి గ్రామంలో నిర్మించిన డంపింగ్ షెడ్లతో 12,516 గ్రామాలు తడి చెత్త నుంచి 36.04 లక్షల కిలోల ఆర్గానిక్ వర్మి కంపోస్టు, ఎరువును తయారు చేశాయి.
పల్లె ప్రకృతి వనాలు
పల్లె ప్రకృతి వనాలు ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్లకు వేదికలుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,472 పల్లె ప్రకృతి వనాలను 13,657 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వీటిలో 2.12 కోట్ల మొక్కలను నాటారు.బృహత్ పల్లెప్రకృతి వనాలను పది ఎకరాల్లో ఏర్పాటు చేశారు.
ఇంటిపన్ను వసూళ్లలోనూ..
2014-15లో రాష్ట్రంలో ఇంటి పన్ను వసూళ్ల శాతం 62.97 మాత్రమే. అది 2021-22 నాటికి 97.18 శాతానికి చేరింది.
అవార్డులే అవార్డులు
కేంద్రం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2021-22 జాతీయ పంచాయతీ అవార్డులను ప్రకటించింది. మొత్తం 46 అవార్డుల్లో 13 తెలంగాణకు దక్కాయి. ఇప్పటి వరకు దాదాపుగా 80కి పైగా అవార్డులు రాష్ట్రం సొంతం అయ్యాయి.
తెలంగాణకు వచ్చిన అవార్డులు: