Uttam Kumar Reddy | హైదరాబాద్, జులై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రాధాన్యం దక్కడం లేదని, ఆయన బైపాస్‌గా మిగిలారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా సీఎంవో నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే అధికారులు పాటిస్తున్నారని, వాటికి సంబంధించి మంత్రికి కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదని విశ్వసనీయంగా తెలిసింది.
ఇందుకు సంబంధించి ఇటీవల సన్నబియ్యం టెండర్లలో తక్కువ ధరకు బిడ్లు దాఖలు కావడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం. పత్రికల్లో వార్తల ద్వారా విషయం తెలుసుకున్న ఉత్తమ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయినట్టుగా తెలిసింది. నా శాఖలో, నాకు తెలియకుండా విజిలెన్స్ విచారణ ఎలా, ఎవరి ఆదేశాల మేరకు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.