హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టిసారించింది. ఈ మేరకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలేశాపూర్ గ్రామ పరిధిలో పీవీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లో సోదాలు చేపట్టి రూ.1.48 కోట్ల్ల విలువైన ధాన్యం గల్లంతు అయినట్టు తేల్చింది. సోదాల్లో మొత్తం 6,250.23 క్వింటాళ్ల ధాన్యం లోటు ఉన్నట్టు గుర్తించి సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యాన్ని దారి మళ్లిస్తున్నారనే సమాచారం మేరకు సో దాలు చేపట్టారు. తాడికల్ గ్రామంలోని మెసర్స్ రాజా రాజేశ్వర పారా బాయిల్డ్ రైస్ మిల్లో సోదాలు చేపట్టి..రబీ సీజన్లకు చెందిన రూ.6.73 కోట్ల విలువైన 31,234 క్వింటాళ్ల స్టాక్లను మిల్లర్ దారి మళ్లించినట్టు తేల్చారు. మిల్లర్పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు.