VRP | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ముందు విద్యార్థుల రాజకీయ పార్టీ(తెలంగాణ రాష్ట్రం) బుధవారం ఉదయం ఆందోళనకు దిగింది. డీఎస్సీని వాయిదా వేయాలంటూ విద్యార్థుల రాజకీయ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కమలాకర్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. డీఎస్సీని వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వీఆర్పీ నాయకులను అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా వీఆర్పీ నాయకులు మాట్లాడుతూ.. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా నెలకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతిని అందజేయాలన్నారు. జీవో నెంబర్ ను 46ను వెంటనే రద్దు చేయాలి. బాధితులను సూపర్ న్యూమరి పోస్టులతో భర్తీ చేయాలి. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని వీఆర్పీ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. గ్రూప్-2, డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలకు దిగిన విద్యార్థులను క్షణాల్లోనే అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో భయానక వాతావరణం నెలకొంది.
Media | ఓయూలో మీడియాపై పోలీసుల దాడి.. తీవ్రంగా ఖండించిన టీజేఎఫ్
BRSV | పోలీసులా.. రౌడీలా..! ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులపై దాడి.. వీడియో
DSC | మీ కాళ్లు మొక్కుతా.. డీఎస్సీ వాయిదా వేయండి.. ఓ మహిళా అభ్యర్థి ఆవేదన ఇదీ.. వీడియో
KTR | ఓయూలో జర్నలిస్టు అరెస్టు.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్