అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. చేసుకుంటానన్న రైతు వీడియో వైరల్
అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మం డలం అర్లీ(బీ)కి చెందిన రైతు తుడుం గణపతి (58) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
- సోయా పంట కొనుగోలు చేయాలంటూ వేడుకోలు
ఆదిలాబాద్, మార్చి 20 ( నమస్తే తెలంగాణ): అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మం డలం అర్లీ(బీ)కి చెందిన రైతు తుడుం గణపతి (58) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతికి 5.16 ఎకరాల సొంతభూమి ఉండగా మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సోయాబీన్, పత్తి పంటలు సాగు చేశాడు. పెట్టుబడికి బ్యాంకులో రూ.3 లక్షల అప్పు తీసుకురాగా, ప్రైవేట్‌గా మరో రూ.3 లక్షల అప్పు తీసుకొచ్చారు. వానకాలంలో సోయా, పత్తి, జొన్న పంటలు సాగు చేయగా వర్షం కారణంగా పంట నష్టపోయాడు.
వచ్చిన కొద్ది పంటను ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు తీసుకురాగా పంట నాణ్యత విషయంలో కొనుగోలు కేంద్రాల సిబ్బంది అభ్యంతరం తెలిపారు. దీంతో రైతు తన పంటను కొనుగోలు చేయాలని, లేకపోతే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ క్రమంలో గురువారం రాత్రి గణపతి పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు, బంధువులు గమనించి వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

