హైదరాబాద్ : హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఇది అధికారుల తప్పే. వాళ్లు కట్టడానికి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అకారణంగా కూల్చివేసి మా కుటుంబాల్ని రోడ్డున పడేశారని విలపిస్తున్నారు. వారి రోదనలు అరణ్య రోదనలు గానే మిగిలిపోతున్నాయి. కాగా, హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్జోన్లో 7 ఎకరాలు ఉన్నట్లు తేలింది. బఫర్జోన్లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే వారందరికి అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతోపాటు అమీన్పూర్ పరిధిలోనూ అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది.
సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదు.. సామాన్లు తీసుకునే వరకు అయిన ఆగండి అన్నా కూడా ఆగడం లేదు
ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఇది అధికారుల తప్పే వాళ్ళు కట్టడానికి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు.. వాళ్ళు ఏది ఇయ్యకుండా ఉంటే ఇంతకాడికి రాదు కదా
లోపల నుండి సామాన్లు తీస్తుంటే… https://t.co/1eKxLikYJG pic.twitter.com/XdwddGlcRp
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2024