హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. తీర్పును జనవరి 22న వెలువరిస్తామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకూ సింగిల్‌జడ్జి తీర్పు అమలు నిలిపివేస్తూ గతంలో వెలువరించిన స్టే ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, మారు ల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయడంతోపాటు జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేనిపక్షంలో తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్‌జడ్జి గత సెప్టెంబర్ 9న తీర్పు వెలువరించారు.
ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), నోడల్అధికారి (లీగల్) ఆర్ సుమతి, అర్హత సాధించిన అభ్యర్థుల్లో పలువురు వేర్వేరుగా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ ముగించింది.
అంతకుముందు జరిగిన వాదనల సందర్భంగా.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోరాదని సీనియర్ న్యాయవాది రచనారెడ్డి, ఇతరులు వాదించారు. ఒక పరీక్షకు ఒకే హాల్‌టికెట్ ఉండటం దేశంలో పరిపాటని, తొలిసారిగా గ్రూప్-1 పరీక్షలకు రెండు హాల్ టికెట్లను జారీ చేయడం ద్వారా అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. హాల్ టికెట్ల నంబ ర్ల మార్పు నుంచి కేంద్రాల ఎంపిక, వాల్యుయేటర్ల నియామకం వంటి వాటిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడా వెయ్యి వరకు ఉండటాన్నిబట్టి ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో స్పష్టమవుతున్నదని అన్నారు. ప్రిలిమ్స్, మె యిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్లు జారీచేయడం చెల్లదని చెప్పారు. టీజీపీఎస్సీ ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులకు మేలు చేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
నాలుగు కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఎకువ మారులు రావడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నాలుగు కేంద్రాల నుంచే ఏకంగా 162 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఒకసారి 21,093 మంది, మరోసారి 20,161 మంది, ఇంకోసారి 21,085 చొప్పున అర్హత సాధించారని టీజీపీఎస్సీ ప్రకటించడం ద్వారా అక్రమాలు జరిగినట్టు వెల్లడవుతున్నదని చెప్పారు. టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ అదనంగా 563 పోస్టులను కలిపి కొత్తగా నోటిఫికేషన్ జారీచేయడం చెల్లదని అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పోస్టులను పెంచడం చట్టవ్యతిరేకమని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న వారితో వాల్యుయేషన్ చేయించారని, సదరు వ్యక్తి ప్రైవేట్ విద్యా సంస్థ నుంచి జీతం తీసుకుంటున్నారని చెప్పారు.
సుమారు 40% మంది తెలుగులో పరీక్ష రాశారని, 10 నుంచి 12% ఉర్దూలో, మిగిలిన వారు ఇంగ్లిషు మీడియంలో రాశారని చెప్పారు. తెలుగు మీడియంలో పరీక్ష రాసినవారికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. కోఠి మహిళా కళాశాలలోని 18వ సెంటర్లో 721 మంది మెయిన్స్ రాస్తే 39 మంది, అదే కళాశాలోని 19వ సెంటర్లో 776 మంది పరీక్ష రాస్తే వారిలో 32 మంది ఎంపికయ్యారని వివరించారు. సుమా రు 12% మంది ఇక్కడి నుంచే మెయిన్స్‌కు అర్హత సాధించడం వెనుక ‘ప్రతిభ’ ఏపాటిదో తేల్చాలని కోరారు. మూల్యాంకనం రెండుసార్లు చేస్తే 15% తేడా ఉంటే మూడోసారి మూల్యాంకనం జరుగుతుందని నిబంధనల్లో ఉందని చెప్పారు. అయితే దానిని ఆప్టికల్ మెషిన్రీడర్తో డాటాను ఎందుకు భద్రపరచలేదో టీజీపీఎస్సీ స్పష్టం చేయడం లేదని గుర్తుచేశారు.
టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై సింగిల్‌జడ్జి చెప్పిన తీర్పును రద్దు చేయాలని కోరారు. పునర్మూల్యాంకనం చేయాలంటూ సింగిల్‌జడ్జి టీజీపీఎస్సీ నోటిషికేషన్ రూల్స్‌కు భిన్నంగా తీర్పు ఇచ్చారని చెప్పారు. మెయిన్స్‌లో 719 మంది మారులు ఒకే విధంగా రావడానికి టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను సింగిల్‌జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరు మూల్యాంకనం చేశారని, వారిద్దరి మధ్య తేడా 15% కంటే ఎకువ ఉంటే మూడో వ్యక్తి మూల్యాంకనం చేస్తారని వివరించారు.
మూల్యాంకనంలో లోపాలు లేనప్పుడు రాజ్యాంగ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ వ్యవహారాల్లో కోర్టుల జోక్యానికి ఆసారం లేదన్నారు. కొన్ని పరీక్ష కేంద్రాల నుంచి ఎకువమంది ఉత్తీర్ణులయ్యారన్న కారణం గా పరీక్షలు రద్దు చేయడం సరికాదని చెప్పా రు. మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసంపై తమ వివరణను జడ్జి పట్టించుకోలేదని అన్నారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్లు ఇవ్వకూడదనే రూల్ ఎకడా లేదని చెప్పారు. ఇదే తరహా వాదనలను అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ప్రకాశ్రెడ్డి, నిరంజన్‌రెడ్డి వినిపించారు.