హైదరాబాద్, డిసెంబర్26 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో 3వ నిందితుడైన అదనపు మాజీ ఎస్పీ భుజంగరావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, కేసులో పిటిషనర్‌ను అన్యాయంగా ఇరికించారని చెప్పారు. పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించారని, అవన్నీ కోర్టు పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ పొందారని, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎస్ఐబీలో పనిచేసే వారికి సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతో సంబంధం లేకపోయినా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు పేర్కొన్నారు. రెండో నిందితుడు ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగానే భుజంగరావును అరెస్ట్ చేశామని తెలిపారు. దర్యాప్తు మధ్యలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ సుజన ప్రకటించారు.