హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండస్ట్రియల్ పార్ పేరిట భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతల గొంతులను అణచివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.