హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసులు దమనకాండ చేయడం దారుణమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన పేరిట రేవంత్ సరారు దౌర్జన్యానికి పాల్పడుతున్నదని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని చేతబట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. యూనివర్సిటీ భూములను రేవంత్ సరారు తెగనమ్ముతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ‘గతంలో భూముల విక్రయం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలేంటీ? ఇప్పుడు చేస్తున్నదేంటి?’ అని నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి.. మీ రెండు నాలల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. హెచ్‌సీయూ భూములను అమ్మితే బీఆర్ఎస్ ఊరుకోబోదని తేల్చిచెప్పారు.