Vemula Prashanth Reddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నిర్బంధించారు.
యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వేముల ప్రశాంత్ రెడ్డి బయల్దేరగా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను పోలీసులు ఇంటి వద్దే నిలువరించారు.