Khamenei : అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ (Irna Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Moztaba Khamenei) ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఆరోపించారు. అమెరికాను ‘క్రిమినల్ దేశం (Criminal Country)’ అని, ‘గ్రేట్ సాతాన్ (Great Sataan)’ అని విమర్శించారు. ఈ సందర్భంగా మొజ్తబా ఖమేనీ తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ సందేశాన్ని విడుదల చేశారు.
ఇంతటి గొప్ప ప్రజాస్పందన ప్రాంతీయ రాజకీయంపరంగా కొత్త మార్పులకు తెరతీసిందని ఆయన అన్నారు. అమెరికా ఆధిపత్యానికి గండికొట్టేందుకు ఇదే నిదర్శనమని ఖమేనీ చెప్పుకొచ్చారు. కాగా జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల బలగాల దాడిలో అమెరికాకు చెందిన సైనికులు ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లు అమెరికా ఇటీవల ధ్రువీకరించింది. దీనికి అమెరికా ఐఆర్జీసీ స్థావరాలు సహా వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్ నిల్వల కేంద్రాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది.
తాజా దాడుల్లో నిర్మాణంలో ఉన్న ఓ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.