Deshapathi Srinivas | కరెంట్ కోసం పవర్ స్టేషన్ల దగ్డర ధర్నాలు చేస్తున్నారు. జాతీయ రహదారులను దిగ్భంధిస్తున్నారు. పొట్టకొచ్చిన చేను ఎండిపోతున్నదని రైతులు పొగిలి పొగిలి ఏడుస్తున్నరని.. ముఖ్యమంత్రికి ఇవేవీ పట్టవు.. ఇవేవి వినబడవని శాసన మండలి బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల బ్రతుకులు ప్యారడైజ్ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బ్రతుకుల్లా మారాయని తెలంగాణలో నీరో రాజ్యం కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్‌పైన నిరంతరం విషం చిమ్ముతున్నారని అన్నారు. ఢిల్లీకి సూట్ కేసులు ప్రతిపక్షంపై కేసులు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని.. పోలీసులు ప్రతిపక్ష నేతల ఇళ్ల వద్ద బందీలుగా మారారు. కాంగ్రెస్ నేతల బౌన్సర్లలాగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ నేతల రిమాండ్ ను కోర్టులు రిజెక్ట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో బరితెగింపు పాలన నడుస్తోందని దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో బారికేడ్లు ఎక్కి నిరసన చేస్తున్నారు. ఢిల్లీలో బడే భాయ్ మోదీ కేసులు పెట్టలేదు. ఇక్కడ చోటే భాయ్ కేడీ అరెస్టులు చేస్తున్నారు.. మెడికవర్ హాస్పిటల్ ముందు ఫ్లెక్సీలు పెడితే అరెస్ట్ చేస్తారా..? కేసీఆర్ ఫామ్ హౌస్‌పై ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బ్యూరో క్రాట్ ఫిర్యాదు చేస్తే అరెస్టు చేస్తారా..? అని దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
లిక్కర్ తయారీకి నీళ్ల కరువు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదా…? లేని రంకులు అంటగట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదా..? మూడేళ్లలో కాంగ్రెస్ చేసిన ఘనత శూన్యమని.. ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీ అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు నిర్బంధాలు కొనసాగిస్తోంది. కేసీఆర్ నిరంకుశ పాలన నడుస్తోందని కొంతమంది మేధావులు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏమైనా పాలంకుశ పాలన నడుస్తోందా…? రేవంత్ రెడ్డికి సమయం దగ్గర పడిందన్నారు.రేవంత్ రెడ్డి సీఎంగా, హోంమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నీ పరిస్థితి ఏంటి..? అని దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ వున్న తన అనుయాయులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లై ఓవర్లు,అండర్ పాస్ లను రద్దు చేశారన్నారు. ప్రజలకు రీ కాల్ చేసే హక్కు ఉంటే ఈపాటికే రేవంత్ రెడ్డిని చెత్తబుట్టలో పడేసేవారు. సీఎం రేవంత్ రెడ్డికి సద్భుద్దిని దేవుడు ప్రసాదించాలి..తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లాంటి ద్రోహుల వల్లే యువత బలిదానాలు జరిగాయి…రేవంత్ రెడ్డి పేరు రాసి మరీ కొందరు ఆత్మాహుతి చేసుకున్నారు..రేవంత్ రెడ్డికి అమరుల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది..? అసైన్డ్ భూమిలో అమరవీరుల కాలనీ ఎందుకు.. అమరవీరులకు, దళితులకు తగాదా పెట్టవద్దని కోరారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లో, నువ్వు అంటున్న ఫోర్త్ సిటీలో అమరుల కాలనీ కట్టు అని దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ @TheDeshapathi మీడియా సమావేశం https://t.co/u1Y8T1jXfU
— BRS Party (@BRSparty) October 7, 2026
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!