మొయినాబాద్, అక్టోబర్07 : రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిదిమేసింది.. మృత్యువు వారిని కబాలించి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో భార్య, భర్త, కుమారుడు ముగ్గురు దుర్మరణం చెందాగా..కూతురు దావఖాన్ లో చికిత్స పొందుతుంది. గ్రామంలో వరుస శవయంత్రలు, అంత్యక్రియలు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విధారక రమైన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు(35), భార్య సావిత్రి(31), కుమారుడు ధనుష్ (6), కూతురు అక్షిత(8) లు నలుగు మంగళవారం మధ్యాహ్నం చేవెళ్ల మండల పరిధిలోని చన్వెల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో విందుకు వెళ్లారు. తిరిగి అదే రోజు రాత్రి మధు తన భార్య పిల్లల్తో కలిసి స్వగ్రామానికి బైక్ పై వస్తున్నాడు.
చేవెళ్ల మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం గేట్ వరకు రాగానే గుర్తు తెలియను వాహనం ఢీకొట్టడంతో మధు, తన భార్య సావిత్రి, కొడుకు ధనుష్ ముగ్గురు దుర్మరణం చెందారు. కూతురికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం దావఖనకు తరలించారు. బుధవారం మేడిపల్లి గ్రామంలో ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించారు. భర్త,భార్య ఇద్దరు పాడెలు ఒకదాని వెంబడి ఒకటి తీసుకెళ్లడంతో పాటు చిన్నారి బాబును చేతులపైన కట్టుకొని వెళ్తుండగా గ్రామంలోని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టింది చాయి.
