మహబూబ్ నగర్ : అక్రమంగా ఆస్తులు ( Illegal assets ) సంపాదించినట్లు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) తిప్పికొట్టారు. తాను అరగుంట భూమిని అక్రమంగా సంపాదించినట్లు రుజువు చేస్తే ముక్క నేలకు రాసి క్షమాపణ చెబుతానని మంత్రులకు సవాలు విసిరారు.
పాలమూరు జిల్లాలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వందలాది ఎకరాల భూమిని సంపాదించారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు సంవత్సరాలైన కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) చేసిన ఆరోపణలు నేటికి రుజువు చేయలేక పోయారని విమర్శించారు. వ్యతిరేక ప్రచారాలు చేస్తే చట్టబద్ధంగా ఎదుర్కుంటా మని హెచ్చరించారు.పానగల్ వ్యవసాయ క్షేత్రం తన కష్టార్జితమని వెల్లడించారు.
663 సర్వే నంబర్ ఉబేద్దుల కొత్వాల్ చెందినదని, ఇందులో అధికారులపై ఒత్తిడి చేసి మా అమ్మాయికి చెందిన అరగంట అక్రమమని తేల్చారని ఆరోపించారు. ప్రభుతంపై నిత్యం పోరాడుతున్న తనపై వ్యక్తిగత కక్షకు పాల్పడుతున్నారు. అన్ని ఆస్తులు బహిరంగ పరుస్తా. మీకు చేతనైతే మీడియా సాక్షిగా తనపై చేసిన భూ ఆక్రమణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. అసూయా, కుయుక్తులతో రాజకీయ మనుగడకు తావు లేదని, దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు.
జూరాల నుంచి నీళ్లు వదలి రైతాంగాన్ని కాపాడాలి
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 70 టీఎంసీల నీళ్లున్నాయని , పంపులను నిర్విరామంగా నడిపి, జూరాల నుంచి నీళ్లు వదలి రైతాంగాన్ని కాపాడాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. నార్లపూర్ పంపులు వెంటనే ప్రారంభించకపోతే 12వ తారీఖున వేలాది మంది రైతులతో ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు కరెంట్ లేక,నీళ్లు లేక,యూరియా లేక రుణమాఫీ లేక రైతు భరోసా లేక ఇబ్బందులు పడుతుంటే రైతాంగాన్ని అందుకోవాల్సింది పోయి ప్రజా సమస్యల పట్ల నిత్యం ప్రశ్నిస్తుంటే వ్యక్తిగత కక్ష్యకు పాల్పడడం నాయకుల కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, బి.లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, లక్ష్మారెడ్డి, నందిమల్ల అశోక్, కృష్ణా నాయక్, మాణిక్యం, వనం.రాములు, రాళ్ళ కృష్ణయ్య, గంధం పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.