Sonia Gandhi: పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు.. రిపోర్టు కోరిన ఢిల్లీ కోర్టు
Sonia Gandhi: సోనియా గాంధీకి భారతీయ పౌరసత్వం రాకముందే ఓటరు జాబితాలో ఆమె పేరు ఉన్నట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. ఆ కేసులో రిపోర్టు సమర్పించాని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత సోనియా గాంధీ(Sonia Gandhi)కి భారతీయ పౌరసత్వం రాకముందే ఓటరు జాబితాలో ఆమె పేరు ఉన్నట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. ఆ కేసులో రిపోర్టు సమర్పించాని పోలీసులను ఢిల్లీ కోర్టు కోరింది. వికాశ్ త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మెజిస్ట్రేట్ కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులోని జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ వినోద్ జోషీ ఈ ఆదేశాలు ఇచ్చారు. సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వికాశ్ తన పిటీషన్లో కోరాడు. అయితే ఈ అంశంపై నవంబర్ 28వ తేదీన కోర్టు విచారణ చేపట్టనున్నది.
2025 సెప్టెంబర్ 11న వికాశ్ ఇచ్చిన ఫిర్యాదును అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా డిస్మిస్ చేశారు. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ త్రిపాఠి సెషన్స్ కోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజవకర్గంలో 1980లోనే ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉన్నట్లు త్రిపాఠి ఆరోపించారు. కానీ భారతీయ పౌరసత్వం ఆమె కు ఏప్రిల్1983లో కల్పించినట్లు పేర్కొన్నారు.1980 ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉన్నా.. ఆ తర్వాత 1982లో ఆ పేరును డిలీట్ చేశారన్నారు . మళ్లీ 1983లో సోనియా పేరును ఓటర్ల లిస్టులో చేర్చినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIddipeta | సిద్దిపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్న సిబ్బంది.. వీడియో
Sonia Gandhi: పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు.. రిపోర్టు కోరిన ఢిల్లీ కోర్టు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
Masooda | తిరువీర్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్బస్టర్.. ‘మసూద’ సినిమాకు 4 ఏళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

