SIddipeta | సిద్దిపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్న సిబ్బంది.. వీడియో
SIddipeta | సిద్దిపేట పట్టణంలోని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి.. కాంగ్రెస్ ప్లెక్సీలు, బ్యానర్లను అలాగే ఉంచడంపై బీఆర్ ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Siddipeta | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీల వివాదం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ సిబ్బంది సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి పక్కనే ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్నారు.
పట్టణంలోని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి.. కాంగ్రెస్ ప్లెక్సీలు, బ్యానర్లను అలాగే ఉంచడంపై బీఆర్ ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక షాపు వీళ్ల కంటికి బీఆర్ ఎస్ ప్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నయి.. ఇక్కడనే కాంగ్రెస్ ప్లెక్సీ కూడా ఉంది.. మున్సిపల్ సిబ్బందికేమో కాంగ్రెస్ ప్లెక్సీనేమో కనిపిస్తలేదు.. ఓ సామాన్యుడు అభిమానంతో తన షాపుపైనే బీఆర్ఎస్ ప్లెక్సీ పెట్టుకుంటే వాటిని తొలగిస్తున్నరు.. అంటే కాంగ్రెసోళ్లకు ఒక న్యాయం, బీఆర్ఎస్ వాళ్లకు ఒక న్యాయం.. తీసేస్తే మొత్తం తీసేయాలి..
కేవలం ఒక్క పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే.. పై అధికారుల ఆదేశాల మేరకే చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పడంపై ఫైర్ అయ్యారు. ఒక షాపు అతను పెట్టుకున్న బీఆర్ఎస్ ప్లెక్సీలు తీసేస్తున్నారు.. సిద్దిపేటలో అడుగడుగునా కాంగ్రెస్ ప్లెక్సీలున్నాయి.. మరి వాటిని కూడా తీసేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది.
సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి పక్కనే ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేసిన మున్సిపల్ సిబ్బంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీల వివాదం
పట్టణంలోని మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది
మున్సిపల్ సిబ్బందిని అడ్డుకుని ప్రశ్నించిన బీఆర్ఎస్ శ్రేణులు
కేవలం ఒక్క పార్టీకి సంబంధించిన
ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే.. పై అధికారుల ఆదేశాల మేరకే చేస్తున్నామని చెబుతున్న మున్సిపల్ సిబ్బంది— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIddipeta | సిద్దిపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్న సిబ్బంది.. వీడియో
Sonia Gandhi: పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు.. రిపోర్టు కోరిన ఢిల్లీ కోర్టు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
Masooda | తిరువీర్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్బస్టర్.. ‘మసూద’ సినిమాకు 4 ఏళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

