BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. భారీ ఎత్తున నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్లో చేరిన నాయకుల వివరాలు… ఆల్ ఇండియా డీఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఒబీసీ వెల్ఫేర్ సంఘ్ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనంద్ రావ్ అంగళ్వార్, వంచిత్ ఆఘాడీ వుమెన్, చంద్రాపూర్ బంజారా ఉమెన్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన రేష్మ హాన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ. బల్బీర్ సింగ్ గురు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ సింగ్ సలూజా, గడ్చిరోలి మాజీ జెడ్పీ చైర్మన్ పసుల సమ్మయ్య, గడ్చిరోలి మాజీ జడ్పీ సభ్యులు సంజయ్ చర్దుకె, యువ స్వాభిమాన్ పార్టీ రజురా జిల్లా అధ్యక్షుడు సూరజ్ థాకరే, చంద్రాపూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిలీప్ పల్లేవార్, బిర్సాముండా క్రాంతిదళ్ అధ్యక్షుడు సంతోష్ కులమతే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంపెల్లి మల్లేష్, ఆప్ బల్లార్పూర్ విభాగ్ అధ్యక్షుడు ప్రశాంత్ గడ్డల, ఇండియన్ టీవీ చంద్రాపూర్ జిల్లా రిపోర్టర్ నరేష్ ఆరెపల్లి, భారత్ ముక్తి మోర్చా వరింగ్ అధ్యక్షుడు శనిగరపు శంకర్, యువ స్వాభిమాన్ పార్టీ సెక్రటరీ ఆదిత్య భాకె, శివసేన గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు మిలింద్ భాసర్, చంద్రాపూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అరికిల్ల హనుమంతు, డబ్ల్యూసీఎల్ ఐటిటియుసి అధ్యక్షుడు నర్సింగ్ రాజం దొంత, విదర్భ తెలుగు సమాజ్ ప్రధాన కార్యదర్శి రాజేషం పుల్లూరి, తేలి సమాజ్ జిల్లా అధ్యక్షుడు రవి జుమ్డే, విదర్భ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తిరమల్ ముంజమ్, శివసేన పార్టీ రాజుర పట్టణ అధ్యక్షుడు రాకేష్ చికుల్వార్, శివసేన బల్లార్షా అధ్యక్షుడు సన్నీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెరెన అజ్మీరా, యువస్వాభిమాన్ గడ్చిరోలి ఉపాధ్యక్షుడు అజయ్ చన్నే, చంద్రాపూర్ డ్రైవర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ వ్యవస్థాపకుడు అభిలాష్ సింగ్ తదితరులతో పాటుగా మరో నలభై మందికి పైగా నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ మూడు బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. నాందేడ్, కంధార్ లోహా, ఔరంగాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలు విజయవంతం అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేయాలని ఆ రాష్ట్ర వాసులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.