గజ్వేల్, అక్టోబర్ 18: సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించి మల్లన్నసాగర్, కొండపోచమ్మ ముంపు గ్రామాల్లో పర్యటిస్తే వెయ్యి మందితో స్వాగతం పలుకుతామని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ముంపు గ్రామాలకు చెందిన 9600 మంది బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, ప్యాకేజీలు అందజేశామని చెప్పారు.
ప్రస్తుతం ముంపు గ్రామాలకు చెందిన 400 మంది నిర్వాసితులకు రావాల్సిన రూ.448 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తాగు, సాగునీటిని అందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నదని ఫైర్ అయ్యారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో హైదరాబాద్‌కు తాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. మూసీ సుందరీకరణతో రూ.1.50 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కార్ మొద్దు నిద్ర వీడి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.