అంబేద్కర్ అభయ హస్తం ఎక్కడ?
అధికారంలోకి వచ్చిన వెంటనే దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని అటకెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు అంబేద్కర్‌కు దండలేయడం అంటే ఆ మహానుభావుడిని అవమానించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అఢ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు.
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన వెంటనే దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని అటకెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు అంబేద్కర్‌కు దండలేయడం అంటే ఆ మహానుభావుడిని అవమానించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అఢ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బోడుప్పల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇస్తామని చెప్పిన విద్యా సహాయం ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వకపోగా ఆ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. చేవెళ్ల డిక్లరేషన్‌కు తూట్లు పొడిచి నేడు దళితుల పక్షపాతిగా మాట్లాడటం అంబేద్కర్‌ను అవమానించడమేనని దుయ్యబట్టారు. పత్రికా ప్రకటనల్లో మాదిగ మంత్రి ఫొటో లేకుండా చేశారని, ఇది మాదిగలను అవమానించడమేనని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్‌తోపాటు కడియం శ్రీహరి ఫొటోలు ప్రచురించారని గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

