రబ్బరు బంతిలా తిరిగొస్తాం.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎంత అణచివేత చర్యలకు దిగినా రబ్బరు బంతిలా తిరిగొస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ప్రజలు, రైతుల పక్షాన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎంత అణచివేత చర్యలకు దిగినా రబ్బరు బంతిలా తిరిగొస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ప్రజలు, రైతుల పక్షాన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావును నిర్బంధించడం, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు సంఘీభావంగా పరిగి వెళ్తున్న వారిని అడ్డుకోవడాన్ని ఖండించారు.
రైతుల పక్షాన పోరాడితే అక్రమ కేసులా?
- బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్
రాష్ట్రంలో రైతులు పక్షాన పోరాటం చేస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా? అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుల్లో వణుకు పుడుతున్నదని ఆయన విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు అంటే భయమెందుకని నిలదీశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ, కాంగ్రెస్ నేతల అవినీతిని బయట పెడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

