హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. స్టాండింగ్ కమిటీ అధ్యయన యాత్రలో భాగంగా శుక్రవారం మంగళూరులో చైర్మన్ సునీల్ తర్కరే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులు, వాటి ధరలు, వినియోగదారులకు అందుతున్న సేవలు, డిమాండ్, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.